రాష్ట్రంలో నాలుగేళ్లుగా పేరుకుపోయిన LRS(Layout Regularisation) ప్రక్రియను వచ్చే 3 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం భూముల క్రమబద్ధీకరణ జరగాలని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా LRS పూర్తి చేయాలన్నారు.
గత ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబరు 31 వరకు LRS అప్లికేషన్లు స్వీకరించింది. ఆ సమయంలో 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ ఫైళ్ల క్లియరెన్స్ కోసం ఇప్పుడు ప్రత్యేక టీముల్ని ఏర్పాటు చేసుకోవాలని, సిబ్బంది కొరత ఉంటే డిప్యూటేషన్ పై తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇందుకుగాను సిబ్బంది, ఇతర అధికారులకు ట్రెయినింగ్ ఇవ్వాలన్నారు.
అప్లికేషన్ల పరిశీలనకు రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్ అధికారులతో మల్టీ డిసిప్లినరీ బృందాల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అన్ని కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు(Help Desks) అందుబాటులోకి తెస్తారు. GHMC, HMDA, పురపాలికలు మినహా మిగిలిన ప్రాంతాల్లో దరఖాస్తుల్ని కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు.
పరిధి | వచ్చిన అప్లికేషన్లు |
మున్సిపాల్టీలు | 13.69 లక్షలు |
గ్రామ పంచాయతీలు | 6 లక్షలు |
HMDA | 3.58 లక్షలు |
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ | 1.35 లక్షలు |
GHMC | 1.06 లక్షలు |