ఎల్ఆర్ఎస్(LRS) గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం 25% రాయితీతో వన్ టైమ్ సెటిల్మెంట్(OTS)ను సర్కారు అందుబాటులోకి తెచ్చింది. మార్చి తొలి వారంలో OTS వచ్చినా మొదట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫీజు చెల్లింపునకు ఆటంకాలు, పోర్టల్ ఓపెన్ కాకపోవడం, ఫీజు చెల్లించాక ప్రొసీడింగ్స్ రాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఉగాది, రంజాన్ పండుగ రోజుల్లోనూ ఫీజు చెల్లింపునకు అవకాశమిచ్చింది. అయితే చాలా మంది LRSకు ముందుకు రాకపోవడంతో మరింత మందికి ఛాన్స్ ఇచ్చేలా గడువు పొడిగించింది.