మాదాపూర్లో మూడున్నర ఎకరాల్లో ఉన్న N కన్వెన్షన్(Convention)ను అధికారులు కూల్చివేశారు. సినీనటుడు(Actor) అక్కినేని నాగార్జునకు చెందిన ఈ కన్వెన్షన్ ను 200 మంది పోలీసు బందోబస్తు నడుమ పొక్లెయిన్లతో నేలమట్టం చేశారు. తుమ్మిడి చెరువును ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని గుర్తించిన హైడ్రా అధికారులు సదరు సెంటర్ ను తొలగించారు. గతంలో 29 ఎకరాల్లో ఉన్న చెరువు కాస్తా ప్రస్తుతం 6 ఎకరాలకు చేరుకుంది.
దీనిపై ఇప్పటివరకు నాగార్జున నుంచి కానీ ఆయన కుటుంబం కానీ దీనిపై రెస్పాండ్ కాలేదు. 2010లో N కన్వెన్షన్ నిర్మించగా, వివిధ రకాల వేడుకలు నిర్వహిస్తున్నారు. నాగార్జున, మరో వ్యక్తి దీనికి యజమానులు(Owners)గా ఉన్నారు. 2014లోనే ఇది అక్రమమని తేల్చినా ఇప్పటివరకు దీన్ని కూల్చకపోడంపై విమర్శలు వచ్చాయి.