సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని మెజార్టీ రైతులు తమ అభిప్రాయాల్ని తెలియజేశారు. కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశాలు నిర్వహించారు. పన్ను చెల్లింపుదారుల్ని(Tax Payers) పక్కనపెట్టడంతోపాటు, ఏజెన్సీ ప్రాంతంలో పట్టాలు లేని రైతులకు సైతం పథకాన్ని అందించేలా చూడాలని కోరారు.
భరోసా, బోనస్…
అన్ని పంటలకు బోనస్, కౌలు రైతులకు భరోసా అందించాలని ఎక్కువ మంది రైతులు కమిటీకి నివేదించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ సర్కారు తెచ్చిన 2011 కౌలు రైతు చట్టాన్ని పునరుద్ధరించాలని కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో రైతులు కోరారు.
విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు ఉచితంగా ఇవ్వాలంటూ కమిటీ సభ్యులైన మిగతా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అన్నదాతలు కోరారు.