రాష్ట్రానికి కొత్త ఎయిర్ పోర్టు మంజూరు(Sanction) వెనుక పెద్ద తతంగమే నడిచింది. ఇందుకోసం శంషాబాద్(Shamshabad) విమానాశ్రయాన్ని నిర్మించిన GMRతో ప్రత్యేకంగా చర్చలు జరపాల్సి వచ్చింది. వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే 150 కిలోమీటర్ల లోపు మరో విమానాశ్రయం ఉండకూడదన్నది శంషాబాద్ విమానాశ్రయం నిర్మించిన సమయంలోనే ఒప్పందం ఉంది. ఇప్పుడు ఖరారైన మామునూరు ఎయిర్ పోర్టు.. శంషాబాద్ కు 150 కి.మీ. లోపే ఉంది. దీంతో GMR యాజమాన్యంతో కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడే చర్చలు జరపాల్సి వచ్చింది. ఆ సంస్థ అంగీకారం తెలపడంతో మామునూరుకు లైన్ క్లియర్ అయింది. వెంటనే పనులు చేపట్టాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి కేంద్ర మంత్రి ఆదేశాలిచ్చారు.