రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగి ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు(Mulugu) జిల్లా ఏటూరు నాగారం అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇల్లెందు-నర్సంపేట ఏరియా కమిటీ దళానికి చెందిన మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. మృతుల్లో కీలక నేతలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వేకువజామున(Early Hours) జరిగిన ఎన్ కౌంటర్లో AK-47లు సహా భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృతదేహాల్ని పోలీసులు గుర్తించారు.
ఇల్లెందు-నర్సంపేట దళానికి భారీ నష్టం జరిగినట్లుగా తెలుస్తున్నా ఇంకా పోలీసులు ధ్రువీకరించలేదు. ములుగు జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఈమధ్యకాలంలో పెరిగాయి. పోలీసు ఇన్ఫార్లంటూ ఇద్దరిని మావోయిస్టులు దారుణంగా చంపారు. దీంతో పోలీసులు భారీగా నిఘా పెట్టి ములుగు జిల్లాలో కూంబింగ్ చేపడుతున్నారు.