
శివరాత్రికి శివ శివా అంటూ చలి పోతుందన్నది వాడుకలో ఉన్న మాట. కానీ శివరాత్రికి 15 రోజుల ముందునుంచే ఎండలు దంచికొడుతున్నాయి. చలి ఆనవాళ్లే లేకుండా పోగా, గత మూణ్నాలుగు రోజుల నుంచే ఉష్ణోగ్రతలు(Temperatures) పెరిగిపోతున్నాయి. ఈరోజు రాష్ట్రంలోనే అత్యధికంగా మహబూబ్ననగర్లో 37 డిగ్రీలు నమోదైంది. ఖమ్మం(Khammam)లో 36.6, భద్రాచలంలో 35.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ప్రాంతాల వారీగా ఉష్ణోగ్రతలిలా…
| ప్రాంతం | ఉష్ణోగ్రత |
| మహబూబ్ నగర్ | 37 |
| ఖమ్మం | 36.6 |
| భద్రాచలం | 35.8 |
| నిజామాబాద్ | 35.4 |
| ఆదిలాబాద్ లో | 35.3 |
| హైదరాబాద్ | 35 |
| రామగుండం | 34.6 |
| మెదక్ | 33.6 |
| నల్గొండ | 33 |
| హన్మకొండ | 32 |