తెలంగాణ మెడికల్, హెల్త్ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ జాయింట్ సెక్రటరీగా లాదినేని రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల సచివాలయంలో జరిగిన యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సూర్యాపేట జిల్లాకు చెందిన రమేశ్ ను ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ తనకు నియామక పత్రం అందించగా.. ఉపాధ్యక్షుడు గిరిబాబు, ప్రధాన కార్యదర్శి బి.సుభాశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.డి.రఫియుద్దీన్, ట్రెజరర్ ఎన్.భిక్షపతి పాల్గొన్నట్లు రమేశ్ తెలిపారు.