స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి మేఘా(MEIL) సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు CM రేవంత్ రెడ్డితో కంపెనీ MD కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ(CSR) నిధుల ద్వారా నిర్మించనుండగా.. MEIL MD పి.వి.కృష్ణారెడ్డి, స్కిల్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ VLVSS సుబ్బారావు ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ భవనాలు, 700 మంది ఆసీనులయ్యే విధంగా భారీ ఆడిటోరియంతోపాటు వివిధ నిర్మాణాల్ని పూర్తి చేయనున్నారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో చేపట్టబోయే వర్సిటీ నిర్మాణాల డిజైన్లను వారం రోజుల్లో కంప్లీట్ చేయాలన్న CM.. నవంబరు 8 నుంచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మొత్తం నిర్మాణాల కోసం మేఘా కంపెనీ రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది.