తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణశాఖ(Meteorology Department) హెచ్చరికలు చేసింది. ఈ రెండు రోజుల్లో మరింత జాగ్రత్త(Alert)గా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. 11 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా వడగాలుల(Heat Waves) తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని తెలిపింది. ఇవి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలున్నందున ఎండలో బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. వెళ్లాల్సి వస్తే చల్లని ద్రవపదార్థాలు వెంట తీసుకెళ్లాలంటున్నది.
కంటిన్యూగా ‘ఆరెంజ్ అలర్ట్’
రెండు రోజుల క్రితమే మెజారిటీ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ఇచ్చిన వాతావరణ శాఖ.. మరో రెండు రోజుల పాటు దాన్ని పొడిగించింది. గత 10 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రత(Temparatures)లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పొద్దున 9 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా… చిన్నపిల్లలు, వృద్ధులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
పగటి వేళలో…
పగటి సమయంలో విపరీతమైన వడగాలులు ఉంటున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ లో 42 డిగ్రీలకు పైగా ఎండలు ఉంటే జిల్లాల్లో అది 44 డిగ్రీలు దాటిపోతున్నది.