మెట్రో రైలును మరింత విస్తరిస్తామని, భాగ్యనగరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పెరుగుతున్న నగరానికి అనుగుణంగా ప్రజారవాణా విస్తృతం చేస్తున్నామని.. అందులో భాగంగా పలు రూట్లలో మెట్రోను పొడిగిస్తున్నామని వివరించారు. జూబ్లీ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్.. నిజామాబాద్ రూట్ లో ప్యాట్నీ నుంచి కండ్లకోయ(ORR) వరకు డబుల్ డెక్కర్… విజయవాడ రూట్ లో ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు… వరంగల్ రూట్ లో ఉప్పల్ నుంచి బీబీ నగర్ వరకు… మహబూబ్ నగర్ రూట్ లో షాద్ నగర్ వరకు విస్తరిస్తామన్నారు.
ఉప్పల్ నుంచి ECIL క్రాస్ రోడ్డు వరకు మెట్రో ఉంటుందని, ఓల్డ్ సిటీ మెట్రో పూర్తి చేయడం… ఎయిర్ పోర్టు నుంచి కందుకూరు వరకు మొత్తంగా ORR చుట్టూ 159 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ఉండేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.