Published 22 Jan 2024
హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైలు విస్తరణకు సంబంధించి రెండో దశ(Phase 2) ప్లాన్ రెడీ అయింది. ఫేజ్-2లో 70 కిలోమీటర్ల మేర కొత్త మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు తయారయ్యాయి. JBS(Jubilee Bus Station) నుంచి MGBS(Mahatma Gandhi Bus Station) వరకు ఉన్న రెండో కారిడార్ ను చాంద్రాయణగుట్ట వరకు పొడిగించబోతున్నారు. దీంతోపాటు కొత్తగా మరికొన్ని కారిడార్లలో రైలు మార్గాల నిర్మాణం జరగనుంది. గత ప్రభుత్వంలో తయారు చేసిన రూట్ మ్యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రద్దు చేశారు. ఇప్పుడు CM సూచనల ఆధారంగానే తాజా మెట్రో రైల్ మార్గాల ప్లాన్ రెడీ చేశారు అధికారులు.
తాజా ప్రణాళిక ఇదే…
కారిడార్ 2:… MGBS నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర విస్తరణ…
కారిడార్ 2:… ఫలక్ నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్లు…
కారిడార్ 3:… నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 29 కిలోమీటర్లు
నాగోల్, ఎల్.బి.నగర్, చాంద్రాయణగుట్ట మీదుగా అంతర్జాతీయ విమానాశ్రయం వరకు…
కారిడార్ 4:… మైలార్ దేవ్ పల్లి నుంచి హైకోర్టు వరకు 4 కిలోమీటర్లు…
కారిడార్ 5:… రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్లు
రాయదుర్గం, నానక్ రామ్ గూడ, విప్రో జంక్షన్ల మీదుగా ఫైనాన్షియల్ డస్ట్రిక్ట్ వరకు…
కారిడార్ 6:… మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు 14 కిలోమీటర్లు
మియాపూర్, బీహెచ్ఈఎల్, పటాన్ చెరు…
కారిడార్ 7:… ఎల్.బి.నగర్ నుంచి హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్లు
ఎల్.బి.నగర్, వనస్థలిపురం, హయత్ నగర్…