రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఔదార్యం చాటుకున్నారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ఈనెల 4న సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి(Victims) రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి.. తన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఈ సాయాన్ని అందిస్తున్నామన్నారు. ఇక వెంటిలేటర్ పై ఉన్న బాలుడు శ్రీతేజ్ వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. హెల్త్ సెక్రటరీ దగ్గరుండి బాలుడి ఆరోగ్య పరిస్థితిని అబ్జర్వ్ చేస్తారన్నారు. ఇకనుంచి సినీ హీరోలు థియేటర్లకు రావద్దని, బెనిఫిట్ షోలన్నీ రద్దు చేస్తున్నామన్నారు. టికెట్ల రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.