రుణమాఫీ అందడం లేదంటూ పలు బ్యాంకుల వద్ద రైతులు ధర్నాలకు దిగుతుంటే.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. వివిధ కారణాల వల్ల రూ.2 లక్షల లోపు రుణం మాఫీ కాని ఖాతాదారుల వివరాలు(Details) సేకరించి వాటిని పోర్టల్ లో అప్లోడ్(Upload) చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటివరకు 22,37,848 అకౌంట్లకు రూ.17,933.19 కోట్లు విడుదల చేశామని, పాస్ బుక్ కలిగి ఉండి రుణాలు పొందని ఖాతాల సంఖ్య 42 లక్షలు(ఆధార్లో తప్పులు, అసలు కన్నా వడ్డీ ఎక్కువున్నవి) మినహా అందరికీ స్కీమ్ వర్తింపజేశామన్నారు మంత్రి.
రుణాలు కలిగి రేషన్ కార్డు లేని వారు, ఆధార్ కార్డులో తప్పులున్న వ్యక్తులు.. దగ్గర్లోని వ్యవసాయాధికారిని సంప్రదించాలని సూచించారు. వీటిని సరిచేసి తర్వాత నిధుల్ని జమ చేస్తామన్నారు.