రాబోయే స్థానిక సంస్థల్లో అమలు చేయాల్సిన 42% BC రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ భేటీ అయింది. ఈ విషయంలో ఎలాంటి న్యాయపర(Legal) వివాదాలు ఉండకుండా సలహా ఇవ్వాలంటూ అడ్వొకేట్ జనరల్(AG) సుదర్శన్ రెడ్డిని కోరింది. ఢిల్లీలోని ప్రముఖ న్యాయకోవిదుల అభిప్రాయం తీసుకోవాలని కమిటీలోని మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు AGకి సూచించారు. మరో సభ్యుడైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్లో అభిప్రాయాల్ని తెలియజేశారు. రాష్ట్రపతి వద్ద ఫైల్ 5 నెలలుగా పెండింగ్ లో ఉందని, కోర్టు ఆదేశాలతో సెప్టెంబరు 30 లోపు ఎన్నికలు జరగాలి కాబట్టి తగిన సలహా ఇవ్వాలని AGని కోరారు.