SC వర్గీకరణపై అధ్యయనం(Study) చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు మంత్రులు, ఒక MPతో కూడిన ఆరుగురి కమిటీకి ఛైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారు. వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కో ఛైర్మన్ గా.. IT మంత్రి శ్రీధర్ బాబు, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క, నాగర్ కర్నూల్ MP మల్లు రవి సభ్యులుగా పనిచేస్తారు.
SC వర్గీకరణపై ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగస్టు 1న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును అధ్యయనం చేయడంతోపాటు సమస్యకు సంబంధించిన అంశాల్ని పరిశీలించడం, వివిధ వర్గాల నుంచి సిఫార్సుల్ని స్వీకరించడం కమిటీ బాధ్యత అని సర్కారు తెలియజేసింది.