గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులతోపాటు వివిధ పార్టీల నేతలు కలిశారు. PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తోపాటు CPI, CPM నేతలు భేటీ అయ్యారు. BCలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలంటూ గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. డాక్యుమెంట్ ఆధారంగా రిజర్వేషన్లు అమలుచేయాలని కోరినట్లు PCC అధ్యక్షుడు తెలిపారు. అయితే BC జనాభా వివరాల్ని గవర్నర్ అడిగి తెలుసుకున్నారు.