మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల(Graduates) నియోజకవర్గానికి ఈమధ్యనే ఎన్నికలు పూర్తయి ఫలితాలు విడుదల కావాల్సిన పరిస్థితుల్లో మరో నోటిఫికేషన్(Notification)ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానం ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ రిలీజ్ చేసింది. అక్కణ్నుంచి ఎన్నికైన BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. దీంతో MLC పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఎన్నిక ప్రక్రియ ఇలా…
మే 2: నోటిఫికేషన్ జారీ
మే 2 నుంచి 9 వరకు: నామినేషన్ల స్వీకరణ
మే 13 వరకు: నామినేషన్ల ఉపసంహరణ
మే 27: ఉప ఎన్నిక పోలింగ్
జూన్ 5: ఓట్ల లెక్కింపు