ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ MLC స్థానాలకు ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ(Withdrawls) పూర్తయింది. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రుల స్థానానికి 68 నామినేషన్లు దాఖలైతే 12 మంది తప్పుకున్నారు. దీంతో 56 మంది బరిలో నిలిచారు. ఇదే నియోజకవర్గ ఉపాధ్యాయ స్థానానికి 15 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 16 మందికి గాను ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ MLC స్థానానికి 19 మంది తుదిపోరుకు సై అంటున్నారు. మొత్తం 22 మంది నామినేషన్లు వేస్తే అందులో ముగ్గురు పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మూడు స్థానాలకు పార్టీలు, యూనియన్ల అభ్యర్థుల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనుండగా, మార్చి 3న కౌంటింగ్ జరుగుతుంది.