రాష్ట్రంలో ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ MLC స్థానాలకు పోలింగ్ నిదానంగా సాగుతోంది. పొద్దున 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. తొలి రెండు గంటల్లో స్వల్ప ఓటింగ్ నమోదైంది. ఇక మధ్యాహ్నం 12 గంటల వరకు కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల(Graduates) స్థానానికి 19.20% ఓట్లు పడ్డాయి. అక్కడే టీచర్ MLC స్థానానికి 33.98% నమోదైంది. కొత్త జిల్లాల పరంగా చూస్తే.. మెదక్ లో అత్యధికంగా 50.04%, ఆ తర్వాత మంచిర్యాల 49.52%తో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 15 జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండగా, పొద్దున పదింటి వరకు గ్రాడ్యుయేట్స్ స్థానానికి 7.1%, టీచర్స్ స్థానానికి 12.7% ఓట్లు పోలయ్యాయి. వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 48.68 శాతం పోలింగ్ నమోదైంది.