విచారణకు రావడం లేదంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… సీబీఐకి లెటర్ రాశారు. సోమవారం(ఈనెల 26న) జరిగే విచారణకు రాను అంటూ అందులో తెలియజేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(Cr.P.C.) 41ఏ కింద ఇచ్చిన నోటీసులు వెనక్కు తీసుకోవాలని, CBIకి సమాచారం కావాలంటే వర్చువల్(Virtual)గా అటెండ్ అవుతానని స్పష్టం చేశారు. ముందుగానే నిర్ణయించిన ప్రోగ్రామ్స్ షెడ్యూల్ వల్ల విచారణకు హాజరు కాలేనంటూ కవిత సమాధానమిచ్చారు.
గతంలోనూ ఇదే తీరున…
‘ఇదే తరహా నోటీసును దర్యాప్తు అధికారి(Investigation Officer).. 2022 డిసెంబరులో సెక్షన్ 160 ద్వారా నోటీసు ఇచ్చారు.. గత 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ పూర్తి విరుద్ధం.. ఇది ఏ పరిస్థితుల్లో ఇచ్చారో క్లారిటీ లేదు.. ఈ నోటీసులు అనేక అనుమానాలు, ప్రశ్నలు కలిగిస్తున్నాయి.. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా మాకు దీనిపై అనుమానం ఉంది.. పార్లమెంటు ఎలక్షన్లలో ప్రచారం చేయాల్సి ఉన్నందున విచారణకు రావడం కష్టంగా ఉంది.. అని కవిత CBIకి తెలియజేశారు.
ఈడీ లాగే సీబీఐకి వర్తింపు…
ఈడీ నోటీసులు జారీ చేసిన విషయంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది… గతంలోనూ నా ఇంటికి వచ్చినపుడు CBIకి సహకరించా… ఇప్పుడు ED మాదిరిగానే సుప్రీంకోర్టు ఆదేశాలు CBI కూడా వర్తిస్తాయి.. కాబట్టి తనకు ఇచ్చిన నోటీసుల్ని ఉపసంహరించుకోవా(Withdraw)లని కోరుతున్నా అని కేసీఆర్ కుమార్తె స్పష్టం చేశారు.