నైరుతి రుతుపవనాల(Southwest Monsoon) ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం వల్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ్టి నుంచి రేపు పొద్దున వరకు 7 జిల్లాల్లో భారీస్థాయిలో, 23 జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి.
భారీ వర్షాలు…
వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల
మోస్తరు వర్షాలు…
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్, కామారెడ్డి