BCల జనాభాలో 14-15 శాతం.. వ్యవసాయమే జీవనాధారం.. ఇలాంటి అనుకూలతలున్న మున్నూరు కాపులు డిమాండ్ల సాధనకు నడుం బిగించారు. చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం ఉంటున్నా.. అన్ని పార్టీల్లోనూ తమ సామాజికవర్గాని(Community)కి చెందినవారు కీలక పాత్ర పోషిస్తున్నా ఇంకా వెనుకబడే ఉంటున్నామన్న భావన మున్నూరు కాపుల్లో ఉంది.
డిమాండ్లు నెరవేర్చుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని మున్నూరు కాపు సంఘం నిర్ణయించింది. రాష్ట్ర, మహిళా, యువజన కమిటీలతో మీటింగ్ లు ఏర్పాటు చేసింది. అందులో కొన్ని నిర్ణయాలను ప్రతిపాదించి వాటిపై పోరాడాలని తీర్మానించింది. ఈ కమ్యూనిటీ నుంచి ప్రస్తుతం ముగ్గురు MPలు, ఇద్దరు MLCలు, ముగ్గురు MLAలు ఉన్నారు. తమ డిమాండ్లతో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని కలవాలని సంఘం నేతలు భావిస్తున్నారు.
ఆ డిమాండ్లివే…
* మున్నూరు కాపులకు మంత్రివర్గంలో స్థానం
* ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.2,000 కోట్లు
* ప్రతి జిల్లా కేంద్రంలో బాల, బాలికల హాస్టల్ కోసం రెండెకరాలు, భవన నిర్మాణానికి రూ.5 కోట్ల ఫండ్
* రూ.20 కోట్లతో ఆత్మగౌరవ భవనం నిర్మించేందుకు 5 ఎకరాల స్థలం
* స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు