జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు(Best Teachers)గా రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం 50 మందికి పురస్కారాలు దక్కగా అందులో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు(తెలంగాణ ఇద్దరు, ఏపీ ఇద్దరు) ఉన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సెప్టెంబరు 5న వీరికి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. .
ఖమ్మం రూరల్ మండలం తిరుమలాయపాలెం ZPSSలో పనిచేస్తున్న ప్రభాకర్ రెడ్డి పెసర, రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట ZPHS ఉపాధ్యాయుడు తాడూరి సంపత్ కుమార్ బెస్ట్ టీచర్లుగా సెలెక్ట్ అయ్యారు. అవార్డు కింద రూ.50 వేల నగదు, రజత పతకం అందజేస్తారు. సెప్టెంబరు 3 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు వీరికి ఉచిత రవాణా, ఇతర సదుపాయాలు కల్పిస్తారు.