రాష్ట్రంలో కొత్తగా 17 బీసీ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతుల్ని ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. గత విద్యా సంవత్సరంలో 15 డిగ్రీ కళాశాలలు మొదలయ్యాయని, ప్రతి జిల్లాకో కాలేజీ ఉండేలా చూశామన్న ఆయన… ఈ ఏడాది ప్రారంభించే విద్యాలయాలకు సంబంధించి అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారుల్ని మంత్రి ఆదేశించారు. తాజాగా నిర్ణయించిన వాటితో కలిపి రాష్ట్రంలో పాఠశాలలతోపాటు ఇంటర్, డిగ్రీ కళాశాలలు, బీసీ గురుకులాల సంఖ్య 327కు పెరిగింది.