ఎన్నికల సంఘం(Election Commission) ఆదేశాల మేరకు ఇటీవలే బదిలీ వేటు పడ్డ అధికారుల స్థానాల్లో కరీంనగర్ జిల్లాకు కొత్త అధికారులు నియామకమయ్యారు. కలెక్టరుగా పమేలా సత్పతి, పోలీసు కమిషనర్ గా అభిషేక్ మొహంతిని ఎన్నికల సంఘం నియమించింది. EC ఆదేశాల మేరకు ఈ ఇద్దర్నీ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు.