హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలందిస్తున్న 1992 బ్యాచ్ అధికారి జితేందర్.. రాష్ట్ర DGP(డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్)గా నియమితులయ్యారు. ప్రస్తుతం DGPగా ఉన్న 1990 బ్యాచ్ అధికారి రవిగుప్తాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను హోంశాఖ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
మర్యాదపూర్వకంగా…
కొత్త DGPగా నియామకమైన తర్వాత జితేందర్.. CM రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జితేందర్ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు కాగా… తొలుత నిర్మల్, బెల్లంపల్లి అడిషనల్ SPగా పనిచేశారు. ఆ తర్వాత మహబూబ్నగర్, గుంటూరు జిల్లాలకు బాస్(SP)గా సేవలందించారు.
వరంగల్ DIG, విశాఖ రేంజ్ IG, సీఐడీ, విజిలెన్స్, గ్రేహౌండ్స్, జైళ్లు, విజిలెన్స్&ఎన్ఫోర్స్మెంట్ లో పనిచేసి… శాంతిభద్రతల DGగా బాధ్యతలు నిర్వర్తించారు.