తెలంగాణలో కొత్త రైల్వే డివిజన్(Railway Devision) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాజీపేటలో ఈ రైల్వే డివిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం DPR(డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారు చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారుల్ని రైల్వే శాఖ ఆదేశించింది. ఈ నిర్ణయంతో కాజీపేట నుంచి కొత్త ట్రెయిన్లు ప్రారంభం కావడంతోపాటు మరిన్ని వర్క్ షాపులు రానున్నాయి. మాణిక్ ఘర్, ఆలేరు, కొండపల్లి సరిహద్దులుగా రైల్వే డివిజన్ ఏర్పాటయ్యే అవకాశముంది.
ఇప్పటికే కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసి నాలుగు దశాబ్దాల కల నెరవేర్చిన కేంద్రం.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెప్పింది. APలో సౌత్ సెంట్రల్ కోస్టల్ రైల్వే జోన్ ప్రకటన రావడంతో కాజీపేట డివిజన్ హోదా రాబోతున్నది. దక్షిణ మధ్య రైల్వే నుంచి కొన్ని డివిజన్లు కోస్టల్ జోన్ తరలిస్తుండటంతో ఆ లోటును పూడ్చడానికి రాష్ట్రంలో కొత్త డివిజన్ కు శ్రీకారం చుట్టాల్సి వచ్చింది.