
Published 24 Jan 2024
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆ దిశగా చర్యలు చేపడుతున్నది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న కొత్త కార్డుల విషయంలో ఇక నిరీక్షణకు తెరదించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అభయహస్తం దరఖాస్తుల వడపోత ఇప్పుడప్పుడయ్యే అవకాశం లేనందున.. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం నూతన విధానాన్ని తీసుకువస్తోంది.
మరిన్ని చదవండి :… ‘ట్రూకాలర్’లో మీ పేరు తప్పుగా చూపిస్తోందా? ఈజీగా మార్చుకోవచ్చు…
కేబినెట్ మీటింగ్ లో…
కొత్త రేషన్ కార్డులతోపాటు పేర్ల మార్పులు, చేర్పుల వంటివన్నీ జరిగేందుకు ఎలాంటి విధానం అవలంబించాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతోంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు.. ఈ జనవరిలోనే సర్కారు నుంచి నిర్ణయం వస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు. జనవరి గడుస్తున్నా ఇంకా కొత్త కార్డుల విషయంలో నిర్ణయం వెలువడకపోవడంతో చాలా మంది నిరీక్షణకే పరిమితమయ్యారు. ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. త్వరలోనే దీనిపై మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting)లో చర్చించాలని నిర్ణయించింది. కేబినెట్ అజెండా(Agenda)లో రేషన్ కార్డుల అంశాన్ని చేర్చడంతో ఇక దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
మరిన్ని చదవండి :… వేగంగా బరువు తగ్గడం ఎలా? ఈ అద్భుతమైన 6 టిప్స్…
బోగస్ కార్డుల తొలగింపే లక్ష్యంగా…
కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతోపాటు బోగస్ కార్డుల తొలగింపే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రేషన్ కార్డు ఉన్నవారు ఈ-కేవైసీ చేసుకోవాలంటూ గత కొన్ని నెలలుగా ప్రభుత్వం చెబుతూనే ఉంది. రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు ఈ నెల 31 వరకు ఉండగా, ప్రతి ఒక్కరూ దీన్ని పూర్తి చేయాలని కొత్త సర్కారు చెబుతోంది. రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి ఆధార్ నంబర్ ఆధారంగా వేలి ముద్ర(Finger Print)లు నమోదు చేస్తే ఈ-కేవైసీ పూర్తవుతుంది. ఈ ఈ-కేవైసీ పూర్తి చేయని కార్డులను తొలగించాలన్న యోచనలో.. అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
రాష్ట్రంలో 11 లక్షల మంది ఇప్పటికీ రేషన్ తీసుకోని వారున్నారు. అలాంటి అనర్హుల్ని తొలగిస్తే మరింత మంది పేదలకు అదనంగా కొత్త కార్డులు ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. అభయహస్తంలో భాగంగా 1.35 కోట్ల అప్లికేషన్లు వస్తే అందులో అత్యధికంగా రేషన్ కార్డులు, గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లవే ఉన్నాయి. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వడపోత(Scrutiny) ఇప్పుడప్పుడే పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో కేబినెట్ మీటింగ్ లో రేషన్ కార్డుల అజెండాను పెట్టారు.
help mee my family sir shaik mustafa nenu kothaga marriage ayyindhi sir naku okka papa house ledhu .restion ledhu marriage certificate ledhu plz my family save sir 9032262328.. inter cast love chesi marriage chesukuna sir