కొత్త రేషన్ కార్డుల(New Cards) జారీలో మూడు రోజులుగా నెలకొన్న అయోమయానికి తెరపడింది. కొత్త అప్లికేషన్లు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. మీ-సేవా కేంద్రాల్లో నిలిచిపోయిన ఆప్షన్(Option)ను తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో ఇక నిన్నట్నుంచి మీ-సేవ వెబ్ సైట్ ద్వారా కొత్త కార్డులకు అప్లికేషన్లు తీసుకోవడం మొదలైంది. ఈనెల 7నే మీ-సేవల్లో ఆప్షన్ తెచ్చినా, తెల్లారే తీసివేస్తూ సివిల్ సప్లయిస్ తీసుకున్న నిర్ణయంతో గందరగోళం ఏర్పడింది. ఇది ప్రజల్ని ఇబ్బందికి గురిచేయడంతో ఆ శాఖ నిర్ణయాన్ని మార్చుకుంది. కొత్త అప్లికేషన్లు తీసుకోవాలంటూ మీ-సేవా కేంద్రాలను ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇంతకుముందు ఇచ్చిన వారి అప్లికేషన్లను పరిశీలిస్తున్నందున కొత్తగా మీ-సేవల్లో వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు.