కొత్త రేషన్ కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జారీకి సంబంధించిన ప్రక్రియను ఈ నెలాఖరు(Month Ending)కు పూర్తి చేసి అక్టోబరులో దరఖాస్తులు స్వీకరిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఈసారి వేర్వేరుగా ఇవ్వబోతున్నారు.
ఈ కొత్త కార్డుల జారీకి గాను లబ్ధిదారుల అర్హతలపై త్వరలోనే మీటింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. కొత్త కార్డుల విషయంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది.