
రాష్ట్రంలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ తోపాటు ఓ మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో ఈ రెండూ ఏర్పాటవుతున్నట్లు సర్కారు ప్రకటించింది. నల్గొండ జిల్లాలోని చండూరును రెవెన్యూ డివిజన్ గా… సంగారెడ్డి జిల్లాలోని తడ్కల్ ను మండలంగా ప్రతిపాదిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చండూరు, మునుగోడు, గట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ మండలాలతో నూతన రెవెన్యూ డివిజన్ అవతరించనుంది.
ఈ రెండింటికి సంబంధించి రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయగా.. అభ్యంతరాల కోసం 15 రోజుల గడువు ఇచ్చింది.