రుణమాఫీ కాలేదంటూ రైతులు చేస్తున్న ఆందోళనలతో గందరగోళం ఏర్పడ్డ వేళ.. ఆ స్కీమ్ అమలు కాని వారి కోసం సర్కారు కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నది. రూ.2 లక్షల లోపు గల కుటుంబ నిర్ధారణ లేని 4,24,873 ఖాతాదారుల సమాచారాన్ని సేకరించేందుకు కొత్త యాప్(App)ను అందుబాటులోకి తెచ్చారు.
వ్యవసాయాధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లడం లేదా రైతు వేదికలు, తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. రుణమాఫీ తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వివరాలు తెలుసుకున్నారు. ఆధార్ వివరాల్లో తప్పులు రికార్డయిన 1,24,545 అకౌంట్లకు గాను ఇప్పటికే 41,322 ఖాతాల్ని సరిచేశామన్నారు.