పాఠశాలల్ని పటిష్ఠం చేయాలన్న ఉద్దేశంతో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు వచ్చే మూడేళ్లలోనే కార్యాచరణ ప్రణాళిక(Action Plan) అమలు చేయాలని CM రేవంత్ ఆదేశించారు. మూడోతరగతి వరకు ఒకలా.. 4 నుంచి మరోలా పాఠశాల విద్య ఉండేలా చూడాలన్నారు.
విద్యావేత్తలు, విశ్రాంత(Retired) IASలతో సమావేశమైన ముఖ్యమంత్రి.. అంగన్వాడీలను ప్లే స్కూళ్లుగా మార్చి విద్యాబోధనకు అదనంగా ఒక టీచర్ ను నియమించాలన్న ఆలోచన చేశారు. నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివేందుకు గాను గ్రామాల నుంచి వెళ్లేలా ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించాలన్న నిర్ణయానికి వచ్చారు.
విద్యావేత్తల నిర్ణయం తీసుకున్నాక ఈ విధానాన్ని ఒకట్రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని CM ఆదేశించారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి త్వరలోనే కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.