రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక స్కీం ఇందిరమ్మ ఇళ్లకు కొత్త టెక్నాలజీ వాడాలని CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. అది ఎలా ఉండాలనే దానిపై దృష్టిపెట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, కలెక్టర్లతో పలు అంశాలు ప్రస్తావించారు. ఇప్పటిదాకా 90 శాతం ధాన్యం(Paddy) కొనుగోళ్ల ద్వారా రూ.12,184 కోట్లు చెల్లించామన్నారు. కలెక్టర్లు చురుగ్గా ఉంటూ వైఫల్యాలు సరిదిద్దుకొని, తప్పుడు ప్రచారాలపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని CM ఆదేశించారు.