రేపటి RTC బంద్ కు ఎంప్లాయిస్ యూనియన్(EU) దూరంగా ఉండాలని తీర్మానించింది. తమ సంఘం ఎలాంటి బంద్ పిలుపు ఇవ్వలేదని EU జనరల్ సెక్రటరీ కె.రాజిరెడ్డి స్పష్టం చేశారు. ‘మేం బంద్ కు మద్దతివ్వట్లేదు.. JAC కూడా బంద్ కు పిలుపునివ్వలేదు కనుక అందరూ డ్యూటీలకు వెళ్లాలని’ రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వంలో విలీన బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ RTCలోని కొన్ని సంఘాలు రేపు బంద్ కు పిలుపునిచ్చాయి. పొద్దున 6 గంటల నుంచి 8 గంటల వరకు రెండు గంటల పాటు బంద్ నిర్వహించాలని RTC మజ్దూర్ యూనియన్ నిర్ణయించింది. ఈ రెండు గంటల పాటు బస్సులు బయటకు రావని ఆ సంఘం లీడర్లు తెలియజేశారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. RTC బిల్లును గవర్నర్ ఆమోదించాలంటూ అటు TMU నిరసన వ్యక్తం చేయనుంది. పొద్దున 10 గంటలకు కార్మికులు నెక్లెస్ రోడ్డుకు రావాలంటూ అందరికీ సమాచారం పంపించింది.