వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్(Revanth) రెడ్డి.. అంతకుముందు ఎల్లంపల్లి రిజర్వాయర్, పోచారం ప్రాజెక్టుతోపాటు గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. సాయంత్రం కామారెడ్డిలో పర్యటించాల్సి ఉండగా హెలికాప్టర్ ల్యాండ్ కాలేకపోయింది. దీంతో మెదక్(Medak) చేరుకుని సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్, స్థానిక MP రఘునందన్ రావుతో కలిసి అధికారులతో రివ్యూ చేశారు.