భారీ వర్షాల ప్రభావంతో సింగరేణిలోని పలు ప్రాంతాల్లో బొగ్గు వెలికితీత ఆగిపోయింది. దీంతో సింగరేణికి గత వారం రోజులుగా భారీ నష్టం కలుగుతోంది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటున్నాయని వాతావరణ కేంద్రం(IMD) తెలిపింది. కొత్తగూడెం ప్రాంతంలో వర్షాల కారణంగా భారీగా నీరు నిలిచి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, కోయగూడెం ఉపరితల గనుల్లో పూర్తిగా తవ్వకాలు నిలిపివేశారు. కోయగూడెం గని ఏరియాలో ఇంచుమించు 3 సెంటీమీటర్ల వర్షపాతం(Rainfall) రికార్డయింది. మణుగూరు OC గనుల్లోనూ ప్రొడక్షన్ ఆగిపోయింది.
రామగుండంలోని 4 సింగరేణి గనుల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. నిండిన నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపుతున్నారు.