రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీని ప్రభావంతో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆగిపోయినట్లు స్టాంప్స్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఈ రోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇదే పరిస్థితి ఉండటంతో ప్రభుత్వానికి రావాల్సిన రూ.కోట్ల లావాదేవీల(Transactions)కు అడ్డుకట్ట పడింది. రాష్ట్రవ్యాప్తంగా 140 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా… అన్నిచోట్లా ఇదే పరిస్థితి కనిపించిందని ఉన్నతాధికారులు తెలియజేశారు. ప్రభుత్వానికి తలెత్తిన నష్టం రూ.50 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తోంది.