Published 23 Jan 2024
ప్రభుత్వ విద్యాలయాల(Schools)కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల యాజమాన్య కమిటీ(School Management Committees)ల ఏర్పాటు ప్రక్రియను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ కమిటీల ఏర్పాటును తాత్కాలికంగా నిలిపివేస్తూ పాఠశాల విద్యా(School Education)శాఖ కమిషనర్ ఎ.శ్రీదేవసేన ఆదేశాలు జారీచేశారు. వీటికి సంబంధించి ఈనెల 18న షెడ్యూల్ విడుదల కాగా ఇక ఎన్నికలు జరగాల్సి ఉన్న పరిస్థితుల్లో కమిషనర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎన్నికలు నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు దృష్టిపెట్టాల్సిందిగా అన్ని జిల్లాల DEOలు, EO-DPOs, సమగ్ర శిక్షా అభియాన్-SSAలకు కమిషనర్ ఆదేశాలు పంపించారు.
ఏర్పాట్లు పూర్తవుతున్న దశలో…
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు సాధారణ ప్రక్రియలో భాగంగా ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 18న విడుదలైంది. SMC మెంబర్స్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలకు నోటీసు ఇచ్చి పిల్లల తల్లిదండ్రుల(Parents) లిస్టును ఈ నెల 20న నోటీసు బోర్డుల్లో ఉంచడంతోపాటు ఈ నెల 22న అభ్యంతరాలు స్వీకరించాలని ఆదేశాలు వచ్చాయి. అందుకనుగుణంగా 20, 22 తేదీల్లో సదరు కార్యక్రమాల్ని అన్ని స్కూళ్లల్లో పూర్తి చేశారు. ఇక పేరెంట్స్ లిస్ట్ ను ఫైనలైజ్ చేసి ప్రాథమిక(Primary), ప్రాథమికోన్నత(Upper Primary), ఉన్నత పాఠశాల(High School)ల్లో తుది జాబితాను ఈ నెల 24న నోటీసు బోర్డుల్లో ఉంచాల్సి ఉన్న తరుణంలో.. విద్యాశాఖ ఊహించని నిర్ణయం తీసుకుంది.
Also Read: ‘వాట్సాప్’లో అడ్మిన్లను బ్లాక్ చేసే సరికొత్త ఫీచర్…
29న ఎన్నిక జరగాల్సి ఉండగా…
ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించి అదే రోజు మెంబర్లు, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ను ఎన్నుకోవాల్సి ఉంది. అనంతరం ఆయా కమిటీలతో అదే రోజు సమావేశాం ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఈ ఎన్నికల్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇంకా మూడు నెలలే మిగిలి ఉండటం, కొత్త క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని ఉపాధ్యాయ సంఘాలు కోరడంతో ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
సంతకం విషయంలో…
ప్రస్తుతమున్న విద్యా కమిటీలు రద్దు కాగా.. వాటి గడువు గతంలోనే డిసెంబరు 31న ముగిసిపోయింది. అటు పాత కమిటీలు లేక, ఇటు కొత్త కమిటీలు ఏర్పాటు కాక పాఠశాలలకు మంజూరయ్యే నిధుల వాడకంలో సమస్యలు వస్తాయన్న భావన కనపడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో చెక్కులపై జాయింట్ సంతకం విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ప్రభుత్వాన్నే విద్యాశాఖ అడిగినట్లు ప్రచారం జరుగుతున్నది. మరి మళ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్నది తేలాల్సి ఉంది.
Also Read: 2024 టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు..
Follow us: justpostnews.com