రాష్ట్రంలో 20 మంది నాన్ కేడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వీరిని బదిలీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వలిచ్చారు. ఎ.రమణారెడ్డి(వెయిటింగ్)ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ SPగా.. వి.అరవిందబాబు(కరీంనగర్ PTC ప్రిన్సిపల్) ను రాచకొండ క్రైమ్స్ DCPగా… ఎస్.వి.నాగలక్ష్మీ(రాచకొండ క్రైమ్స్ DCP)ని CID SPగా… డి.కిషన్ సింగ్(వెయిటింగ్)ను CID SPగా… వి.శ్రీనివాసులు(వెయిటింగ్)ను ఎల్బీనగర్ ట్రాఫిక్-IIగా బదిలీ చేశారు.