రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఆదివారం(ఏప్రిల్ 21) నాడు మద్యం(Wines), మాంసం(Non-Veg) దుకాణాలు మూతపడతాయి. ఈ మేరకు ఆయా షాప్ లకు GHMC కీలక ఆదేశాలు ఇచ్చింది. జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చికెన్, మటన్, ఫిష్ అమ్మకాలతోపాటు వైన్స్ లను తెరవకూడదని స్పష్టం చేసింది.
గీత దాటితే…
ఈ నిబంధనల్ని ఉల్లంఘించిన దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని GHMC అధికారులు వార్నింగ్ ఇచ్చారు. మహావీర్ జయంతి(Mahaveer Jayanthi)ని జైనులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఆ రోజున ఎలాంటి జీవ హింస చేయరాదన్న ఉద్దేశంతో మాంసాహారం బంద్ కు పిలుపునిచ్చారు. జైనుల సంప్రదాయాన్ని గౌరవించాలని GHMC స్పష్టం చేసింది.