
ప్రమోషన్లు వద్దనుకునే స్కూల్ అసిస్టెంట్లకు స్వతహాగా ‘నాట్ విల్లింగ్ ఆప్షన్’ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. తద్వారా హెచ్ఎం(Head Masters) పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం లేకుండా నిర్ణయం తీసుకుంది. ఈసారి గెజిటెడ్ HMలుగా ప్రమోషన్లు ఇచ్చినా మల్టీజోన్ కారణంగా వందలాది పోస్టులు ఖాళీగా ఉండే అవకాశముందని అధికారులు భావించారు. తమకు ప్రమోషన్ వద్దని సీనియర్లు భావిస్తే ఆ HM పోస్టుల్లో తర్వాతి సీనియర్లకు ఛాన్స్ దక్కుతుంది. ఇలా మొత్తం హైస్కూళ్లలో ఖాళీలు లేకుండా చూసుకోవచ్చన్న భావనతో ఈ డిసిషన్ తీసుకున్నారు. త్వరలోనే సీనియారిటీ ఆధారంగా స్కూల్ అసిస్టెంట్లకు GHMలుగా ప్రమోషన్ లు వస్తాయి.
ప్రభుత్వ, జిల్లా పరిషత్తు స్కూళ్లు కలిపి రాష్ట్రవ్యాప్తంగా 2,017 GHM ఖాళీలు ఉండగా.. ఈ రూల్స్ వల్ల వాటిని ఫిల్ అప్ చేసే అవకాశం ఏర్పడుతున్నది. ప్రస్తుతం ఆయా స్కూళ్లలో పనిచేస్తున్న సీనియర్లే హెడ్ మాస్టార్లుగా ఇంఛార్జి బాధ్యతలు చూస్తున్నారు. 2015లో చివరి సారిగా ఉపాధ్యాయులకు ప్రమోషన్ లు ఇచ్చారు. గత ఎనిమిదేళ్లుగా ప్రమోషన్లు లేకపోవడంతో పెద్దయెత్తున ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ‘నాట్ విల్లింగ్ ఆప్షన్’ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.