గతంలో 100 ఎకరాల్లో ఉన్న హైదరాబాద్ దుర్గం చెరువు.. ప్రస్తుతం 84 ఎకరాలకు చేరింది. అంటే 14 ఎకరాల్లో వేలాది కోట్ల రూపాయల విలువైన భవనాలు కట్టినట్లు హైడ్రా గుర్తించింది. ఇప్పుడు వాటన్నింటినీ కూల్చే పనిలో పడ్డ యంత్రాంగం.. సినీ, రాజకీయ, కార్పొరేట్ రంగాలకు చెందినవారు సహా మొత్తం 200 మందికి పైగా నోటీసులు అందించి 30 రోజుల్లోగా కట్టడాల్ని తొలగించాలని స్పష్టం చేసింది.
ఇప్పటికే నాగార్జున ఎన్.కన్వెన్షన్, పళ్లంరాజు సోదరుడి కట్టడాల్ని కూల్చేసిన యంత్రాంగం.. CM రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి నోటీసులిచ్చింది. మాదాపూర్లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో గల తిరుపతిరెడ్డి ఇల్లు.. FTL పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. ఈయనతోపాటు కొందరు IAS, IPS అధికారులకు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల నోటీసులు అందినట్లు తెలుస్తున్నది.