మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నోటీసులు జారీ అయ్యాయి. విద్యుత్తు(Power) కొనుగోళ్ల(Purchase) ఒప్పందం(Agreement)పై వివరణ ఇవ్వాలన్నది ఆ నోటీసుల్లోని సారాంశం. ఈ కొనుగోళ్ల విషయంలో KCRతోపాటు మొత్తం 25 మందికి నోటీసులు పంపినట్లు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు. ఈ నెల 15 వరకు వివరణ ఇవ్వాలని కోరితే జులై 30న రెస్పాండ్ అవుతానని తెలిపినట్లు ఆయన గుర్తు చేశారు.
యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రాల నిర్మాణాలు, ఛత్తీస్ గఢ్(Chattisgarh)తో విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందంపై జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నది. నోటీసులకు సరైన వివరణ ఇవ్వకపోతే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసుల్లో తెలియజేశారు. అన్నిచోట్లా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో విద్యుత్కేంద్రాలు నిర్మిస్తే KCR మాత్రం సబ్ క్రిటికల్ సిస్టంలో నిర్మాణాలు చేస్తున్నారని, ఇది పర్యావరణానికి చాలా డేంజర్ అని తెలిపారు.