ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై మంత్రి KTRకు నోటీసులు జారీ అయ్యాయి. ప్రగతి భవన్ వేదికగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఫిర్యాదులు(Complaints) వచ్చాయని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ తెలిపారు. దీనిపై రిటర్నింగ్ అధికారితోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్ ను పంపి విచారణ నిర్వహించామని, మంత్రి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశామన్నారు.
గవర్నమెంట్ బంగ్లాలు, గెస్ట్ హౌజ్ ల నుంచి ప్రచారం చేయకూడదన్నది ఎన్నికల నిబంధన అని, పూర్తి విచారణ అనంతరం నివేదిక(Report)ను కేంద్ర ఎన్నికల సంఘం(CEC)కి పంపనున్నట్లు GHMC కమిషనర్ కూడా అయిన రొనాల్డ్ రోస్ తెలిపారు.