
నల్గొండ జిల్లా పెద్దఆడిశర్లపల్లి(పీఏ పల్లి) మండలంలో మరో కొత్త మండలం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ”గుడిపల్లి’ మండల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్(Primary Notification) జారీ అయింది. దేవరకొండ డివిజన్ లో ఈ కొత్త మండలం ఏర్పాటు కానుంది. 11 గ్రామాలతో ఈ నూతన మండలం ఏర్పడనుండగా… వివధ వర్గాల నుంచి అభ్యంతరాలు, వినతులు తెలిపేందుకు 15 రోజుల గడువిస్తూ రాష్ట్ర్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.