కారుణ్య నియామకాల కోసం ఏళ్లకేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా పలు పోస్టుల్ని అప్ గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిని అప్ గ్రేడ్ చేయడం ద్వారా ఖాళీ అయిన స్థానంలో ఇక కారుణ్య నియామకాలు జరగనున్నాయి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 1,266 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్ చేస్తూ ఆదేశాలిస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు 33 జిల్లాల్లో 1,266 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను అప్ గ్రేడ్ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. కారుణ్య నియామకాలకు అనువుగా పోస్టుల అప్ గ్రేడేషన్ జరుగుతోంది.
Good