రాష్ట్రవ్యాప్తంగా ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ స్కీమ్ ను పురపాలక శాఖ అందుబాటులోకి తెచ్చింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై ‘వన్ టైమ్ సెటిల్మెంట్(OTS)’పై ఉత్తర్వులిచ్చింది. ఆస్తి పన్ను వసూలుకు ఈ స్కీమ్ ఉపయోగపడనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) తరహాలో పన్ను బకాయిలపై 90 శాతం రాయితీ కల్పిస్తోంది. GHMC మాదిరిగా అవకాశం కల్పించాలంటూ రాష్ట్రంలోని వివిధ మున్సిపాల్టీల నుంచి వినతులు రావడంతో ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నాటికి ఆస్తి పన్ను బకాయిలపై 10 శాతం వడ్డీ చెల్లించిన వారికి OTS వర్తిస్తుందని పురపాలక శాఖ స్పష్టం చేసింది.