మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు పడే 14 జిల్లాలకు వాతావరణ శాఖ(IMD).. అలర్ట్ ప్రకటించింది. జులై 21 మధ్యాహ్నం 1 నుంచి జులై 22 పొద్దున 8:30 గంటల వరకు అలర్ట్ ఉంటుంది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ(Jogulamba) గద్వాల జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు పడబోతున్నట్లు ప్రత్యేక ‘వాతావరణ రిపోర్ట్’ ప్రకటించింది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com